Chandrababu on Floods: వరద నష్టానికి మానవ తప్పిదమే ప్రధాన కారణమని.. రేణిగుంటలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీనిపై న్యాయవిచారణ జరిపించి.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కడప జిల్లాలో పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు తెగిపోయే వరకు అధికారులు ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇసుక మాఫియా అరాచకాలకు సహకరిస్తూ.. సకాలంలో ప్రజలను అప్రమత్తం చేయకపోవడం వల్ల ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన చెందారు. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారో కూడా లెక్కాపత్రం లేదన్నారు. తిరుపతి చుట్టుపక్కల చెరువుల నుంచి నీటి విడుదలలోనూ ప్రభుత్వం చేసిన తప్పిదం.. నగరాన్ని అతలాకుతలం చేసిందన్నారు.
"కడప జిల్లాలో వరదలు వస్తుంటే ప్రభుత్వం అక్కడి ప్రజల్ని అప్రమత్తం చేయలేకపోయింది. గతంలో వరదలు వస్తే వెంటనే రెవెన్యూ, పోలీసు, తదితర ప్రభుత్వ విభాగాలు వరద ప్రాంతాలకు వెళ్లి ప్రజల్ని సురక్షితప్రాంతానికి తరలించేవి. ఇప్పుడు ప్రజల్ని పట్టించుకోకుండా వాళ్లను వదిలేశారు"
-చంద్రబాబు, తెదేపా జాతీయ అధ్యక్షుడు
ఇదీ చదవండి: Chandrababu Naidu visit Nellore: నెల్లూరు జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన