ETV Bharat / city

శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి పట్ల చంద్రబాబు, లోకేశ్ సంతాపం - tirumala archaka died with corona

తిరుమల మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనాతో మృతి చెందడం పట్ల చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

chandra babu lokesh condolence on srinivas deekshithulu death due to corona
శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి పట్ల చంద్రబాబు, లోకేశ్ సంతాపం
author img

By

Published : Jul 21, 2020, 10:45 AM IST

ఇరవై ఏళ్లకు పైగా తిరుమల శ్రీవారికి సేవలందించిన మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనాతో మృతి చెందడం బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం వ్యక్తంచేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కరోనా కారణంగా ఎంతో మంది బ్రాహ్మణులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్న లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బ్రాహ్మణులను ఆదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: 'కొవిడ్​ ఆస్పత్రుల సంఖ్య పెంచాలి.. ప్రజల్లో ధైర్యం నింపాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.