ETV Bharat / city

Kishan Reddy: 'రాష్ట్రంలో కక్ష సాధింపు పాలన'

కేంద్ర పర్యటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తిరుపతిలో పర్యటిస్తున్నారు. కేబినేట్ మంత్రి అయ్యాక మొదటి సారిగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తిరుపతిలో తలపెట్టిన “జన ఆశీర్వాద యాత్ర”లో ఆయన పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో బహిరంగ సభతో యాత్ర ముగిసింది.

కేంద్ర పర్యటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి

author img

By

Published : Aug 18, 2021, 7:57 PM IST

Updated : Aug 19, 2021, 5:11 AM IST

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మార్పు కోరుకుని ప్రజలు జగన్‌ చేతికి అధికారం ఇస్తే.. రెండేళ్ల నుంచి ఇక్కడ ఏం జరుగుతోందో అందరూ ఆలోచించాలన్నారు. అందరికీ సమన్యాయం చేయాలని సీఎం జగన్‌కు సూచించారు. ఓట్లు వేసినా, వేయకపోయినా ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలనూ సమానంగా చూస్తున్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలా చేయట్లేదని విమర్శించారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా బుధవారం తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులనూ పూర్తి చేస్తామని, తాను స్వయంగా సమీక్షిస్తానని హామీ ఇచ్చారు. ‘కరోనాకు టీకా తయారీలో మన తెలుగువారి ఖ్యాతి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దేశ సమగ్రతకు, సమైక్యతకు పాటుపడుతున్న మోదీని ప్రజలందరూ ఆశీర్వదించాలి’ అని కోరారు. పామాయిల్‌ రైతులకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర మంత్రి మండలి బుధవారం నిర్ణయం తీసుకున్న విషయాన్ని తిరుపతిలో ప్రకటించాలని ప్రధాని సూచించినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తానని, కడప జిల్లా గండికోటకు, సింహాచలం అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. లేపాక్షి చేతి వృత్తులను ప్రోత్సహించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అప్పుల పాలన సాగుతుండగా, కేంద్రప్రభుత్వం అభివృద్ధి పాలన సాగిస్తోందన్నారు. తిరుపతి నగరాన్ని స్మార్ట్‌ సిటీ, అమృత పథకాల కింద ఎంపిక చేసి అభివృద్ధి చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, కార్యదర్శి రమేష్‌ నాయుడు, అధికార ప్రతినిధులు భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్‌, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, నేతలు శాంతారెడ్డి, కోలా ఆనంద్‌, దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

కేంద్ర పర్యటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి

ఇదీ చదవండి:

Flash సీఎం జగన్‌కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు..విచారణకు హాజరు కావాలని ఆదేశం

Last Updated : Aug 19, 2021, 5:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.