తిరుమల మొదటి కనుమ దారిలో రెండు కార్లు ఢీ కొన్నాయి. శ్రీవారి దర్శనానంతరం తిరుగు పయనమైన యాత్రికుల కారు 35వ మలుపు వద్ద పిట్టగోడను ఢీకొంది. వెనుక వస్తున్న మరో కారు ప్రమాదానికి గురైన కారును ఢీకొనడంతో.. హైదరాబాద్కు చెందిన నలుగురు భక్తులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరగడంతో మొదటి కనుమ దారిలో కొంత సమయం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి: కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీఓ అనుమతి