కలియుగ వైకుంఠనాధుడు....తిరుమల శ్రీనివాసుడు సుదీర్ఘ కాలం తర్వాత భక్తులకు పున:దర్శనమివ్వనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రత్యేకించి వేలాది భక్తులను తిరుమల శ్రీవారి సన్నిధికి తీసుకెళ్లటంలో కీలక పాత్రపోషించే ఆర్టీసీ....ఘాట్ రోడ్డుపై బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు సర్వం సన్నద్ధం చేస్తోంది.
లాక్డౌన్ కారణంగా రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈనెల 11నుంచి శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్న తరుణంలో.... 6వ తేదీ నుంచే బస్సుల ట్రైల్ రన్ నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్‌పై సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లను మళ్లీ పరిగెత్తించేలా బస్సులన్నింటినీ కండిషనింగ్ చేయటంతో పాటు.... కొవిడ్ -19 ప్రోటోకాల్‌ను పక్కాగా పాటించేలా డ్రైవర్లకు, కండక్టర్లకు తర్ఫీదునిచ్చామంటున్న తిరుపతి ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం మధుతో మా ప్రతినిధి శ్రీహర్ష ముఖాముఖి...
ఇదీచదవండి