తిరుపతి స్విమ్స్ లో ప్రమాదవశాత్తు మరణించిన ఒప్పంద కార్శికురాలి కుటుంబానికి తక్షణమే రూ.5 లక్షల నష్ట పరిహారాన్ని అందచేస్తున్నట్లు చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్ వీరబ్రహ్మం తెలిపారు. కొవిడ్ ఆసుపత్రిలోని కిటికి పైకప్పు పెచ్చులూడి భాధితురాలు మృతి చెందింది. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని భాజపా, వామపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. కొవిడ్ రోగులకు వైద్యసేవలు అందిస్తున్న ప్రాంతంలో కనీస భద్రత లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని నేతలు విమర్శించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న సంయుక్త కలెక్టర్... ప్రమాదంపై విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా భవన నిర్మాణంలో లోపాలు గుర్తిస్తే... గుత్తేదారు, అధికారులపై చర్యలు తీసుకుంటామని వివరించారు. స్విమ్స్‌లో పనిచేస్తున్న మృతురాలు భర్తకు మెరుగైన ఉద్యోగం ఇవ్వటానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు.
ఇదీ చదవండీ... బెజవాడ.. జల సోయగాలను ఆస్వాదిస్తున్న సందర్శకులు