తిరుపతి నియోజకవర్గ అభివృద్ధిలో ప్రధాని మోదీ ముద్ర స్పష్టగా కనిపిస్తుందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు వైకాపా, తెదేపా సిద్ధమా అని తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సవాల్ చేశారు. ఎన్నిక ప్రచారంలో భాజపా చేసిన అభివృద్ధి, గత పాలకుల వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు.
సోము వీర్రాజుపై విజయసాయి చేసిన ట్వీట్.. వైకాపా భయాన్ని స్పష్టం చేసిందన్నారు. సీఎం జగన్‌కు వ్యక్తిగత సేవలు అందించిన వ్యక్తి.. ఎంపీ పోటీకి అర్హులా? అని ప్రశ్నించారు. వ్యక్తిగత సేవలు చేసిన వారికి ఇవ్వటానికి నామినేటెడ్ పోస్టులు చాలా ఉన్నాయని హితవు పలికారు.
ఇదీ చూడండి: