ETV Bharat / city

దేవుడి సొమ్మును ప్రభుత్వానికి తరలిస్తున్నారు: భానుప్రకాశ్ రెడ్డి

author img

By

Published : Sep 19, 2020, 5:50 PM IST

Updated : Sep 19, 2020, 7:18 PM IST

తిరుమల శ్రీవారి సొమ్మును.. ప్రభుత్వానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని భాజపా ఆరోపిస్తోంది. స్వామివారికి కానుకల రూపంలో వచ్చిన సొమ్మును ప్రభుత్వానికి వడ్డీకి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని భాజపా అధికార ప్రతినిధి, తితిదే బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. తితిదే వడ్డీ వ్యాపారం చేస్తోందా అని నిలదీశారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్యమతస్థుల డిక్లరేషన్​పై చేసిన వ్యాఖ్యలను భాను ప్రకాశ్ రెడ్డి తప్పుబట్టారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

భాను ప్రకాశ్ రెడ్డి
భాను ప్రకాశ్ రెడ్డి
దేవుడి సొమ్మును ప్రభుత్వానికి తరలిస్తున్నారు : భాను ప్రకాశ్ రెడ్డి

అన్యమతస్థుల డిక్లరేషన్​పై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న తితిదేపై మరో ఆరోపణ తలెత్తింది. స్వామివారి సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని భాజపా ఆరోపిస్తోంది. కోట్ల మంది భక్తులు స్వామివారికి కానుకల రూపంలో సమకూర్చిన డబ్బును..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాండ్లలలో పెట్టుబడి పెట్టేందుకు తితిదే ప్రయత్నిస్తోందని భాజపా అధికార ప్రతినిధి, తితిదే ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి చెప్పారు.

స్వామి సొమ్ము తరలించే ప్రయత్నం

స్వామి వారి సొమ్మును బాండ్ల రూపంలో ఇవ్వాలనుకోవటంపై భానుప్రకాశ్ అభ్యంతరం తెలిపారు. తిరుమల శ్రీవారికి సంబంధించి వివిధ జాతీయ బ్యాంకుల్లో దాదాపు 12 వేల కోట్ల రూపాయల నిధులున్నాయని.. వీటిలో మెచ్యూరిటీ అయిన ఫిక్స్​డ్ డిపాజిట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాండ్లలలో పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి తితిదే ఆర్థిక కమిటీ ఇప్పటికే అంగీకారం తెలిపిందని.. వచ్చే బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారని ఆయన చెప్పారు. బ్యాంకుల కంటే .. కాస్త వడ్డీ ఎక్కువ వస్తుందని ప్రభుత్వానికి ఇస్తామంటున్నారని.. తితిదే ఏమైనా వడ్డీ వ్యాపారం చేస్తోందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదని.. ఈ పరిస్థితిల్లో స్వామి సొమ్మును తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

తితిదే బోర్డు ప్రతిపాదనలు
తితిదే బోర్డు ప్రతిపాదనలు

సీఎం డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి?

వ్యక్తుల కోసం సనాతన సంప్రదాయాలను మారుస్తారా అని భానుప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్థులకు డిక్లరేషన్​ అక్కర్లేదని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత మనుషుల కోసం నిబంధనలు మార్చడం సరికాదన్నారు. తిరుమల క్షేత్రంలో అన్యమతానికి సంబంధించి తిరుమలలో కఠిన నిబంధనలు ఉన్నాయన్నారు.

రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఏపీజే అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్​పై సంతకం చేసి శ్రీవారిని దర్శించుకున్నారని భానుప్రకాశ్ రెడ్డి గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసిన సీఎం జగన్.... డిక్లరేషన్ ఇవ్వడానికి సమస్య ఏంటని ఆయన ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి డిక్లరేషన్​పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని భాజపా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి : వైకాపాలో చేరిన తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్​ కుమారులు

Last Updated : Sep 19, 2020, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.