ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుందని.. అందుకు అనుగుణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్యను పెంచేలా దర్శన టిక్కెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని భాను ప్రకాశ్‌రెడ్డి కోరారు. పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్న తితిదే.. చిత్తూరు జిల్లాలోని దళితులందరికీ ఉచిత వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని కోరారు. దళితవాడల్లోని భక్తులను తితిదే ఖర్చులతో తిరుమలకు తీసుకువచ్చి దర్శన భాగ్యం కల్పించాలన్నారు.
ఇదీ చదవండి: 'ఆడ పిల్లలకు భరోసా కల్పించడానికే మహిళా మార్చ్'