Arrest Warrant on RK Selvamani: ప్రముఖ దర్శకుడు, దక్షిణ భారత చలన చిత్ర కార్మిక సంఘాల సమ్మేళనం అధ్యక్షుడు, ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణిపై చెన్నై జార్జిటౌన్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. పరువునష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
2016లో సెల్వమణి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసు ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో ఫైనాన్షియర్ ముకుంద్‌చంద్ బోద్రా గురించి పలు అభిప్రాయాలు వెల్లడించారు. దీంతో బోద్రా వారిద్దరిపై జార్జిటౌన్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. బోద్రా మృతి చెందాక, కేసును అతని కుమారుడు గగన్ బోద్రా కొనసాగిస్తున్నారు. ఈ కేసు మంగళవారం విచారణకు రాగా, సెల్వమణి, అరుళ్ అన్బరసులు కోర్టుకు హాజరుకాలేదు. వారి తరఫున న్యాయవాదులు రాలేదు. దీంతో న్యాయమూర్తి వారిద్దరిపై బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేస్తూ విచారణను 23కు వాయిదా వేశారు.
ఇదీ చదవండి : CM Jagan: నేడు గవర్నర్ బిశ్వభూషణ్‌తో ముఖ్యమంత్రి జగన్ భేటీ