ETV Bharat / city

ప్రత్యేకాధికారులుగా ఉన్న విశ్రాంత ఉద్యోగులకు విశ్రాంతి! - తితిదే ప్రత్యేకాధికారులు తొలగింపు న్యూస్

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని విశ్రాంత ఉద్యోగుల సేవలకు ఇక స్వస్తి పడనుంది. జీవో నెంబర్ 2323 ప్రకారం విశ్రాంత ఉద్యోగుల సేవలకు మంగళం పాడాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు అలాంటి సిబ్బంది వివరాలు పంపాలని 145 విభాగాలకు ఆదేశాలు అందాయి.

ap govrnement on tirumala tirupathi devasthanam
author img

By

Published : Nov 1, 2019, 5:45 AM IST

గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకూ పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలకు స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే జీఓ నెంబర్‌ 2323 విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల అమలుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. తితిదే పరిధిలో 2019 మార్చి 31కి ముందు ఒప్పంద, పొరుగు సేవల్లో నియమితులైన విశ్రాంత ఉద్యోగుల వివరాలివ్వాలని 145 విభాగాధిపతులను తిరుపతి జేఈవో బసంత్‌కుమార్‌ ఆదేశించారు.

ప్రముఖులు వైదొలగాల్సిందే

తితిదే పరిధిలోని బర్డ్‌ ఆసుపత్రి ఇన్​ఛార్జి డైరక్టర్‌గాసేవలందిస్తున్న డాక్టర్‌ వెంకారెడ్డితోపాటు మరో నలుగురు ఉద్యోగులూ పదవిని..కోల్పోనున్నారు. తిరుమల అన్నదానం ట్రస్ట్‌ ప్రత్యేక అధికారి వేణుగోపాల్‌, పబ్లికేషన్‌ విభాగం ఉన్నతాధికారి ఆంజనేయులు ... తిరుమల మ్యూజియం ఉన్నతాధికారి, తితిదే ఉపన్యాయాధికారి వెంకటసుబ్బానాయుడు, ఎస్వీ రికార్డింగ్‌ ప్రత్యేక అధికారి మునిరత్నంరెడ్డి, హిందూ ధర్మప్రచార పరిషత్‌ సమన్వయ కర్త చెంచురామయ్య, పురాణ పండితుడు సుమద్రాల లక్ష్మణయ్య వంటి ప్రముఖులు పదవుల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. కీలక విభాగాలైన అన్నదానం, న్యాయవిభాగం ఆలయ నిర్మాణాలను పర్యవేక్షించే స్థపతులు వంటి ప్రత్యేక అధికారుల సేవలు దూరమవనుండటం.. ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే ఆందోళన తితిదేను కలవర పెడుతోంది.

ఇదీ చదవండి:తితిదే ఛైర్మన్ తికమక ... ఒకే ప్రశ్నకు రెండు సమాధానాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.