చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న కేసులు జిల్లాలో వైరస్ వ్యాప్తిని స్పష్టం చేస్తున్నాయి. సోమవారం జిల్లాలో 367 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 7809కి చేరుకుంది.
సోమవారం కరోనాతో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా...జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 84కి చేరుకుంది. తిరుపతిలోనే అధిక సంఖ్య లో నమోదవుతున్న కేసులను దృష్టిలో పెట్టుకున్న అధికారులు 14 రోజుల పాటు నగరంలో లాక్ డౌన్ విధించారు. దుకాణాల నిర్వహణకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతి ఇచ్చారు.
జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు..4432 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. 3293 మంది వివిధ ఆస్పత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి
రాష్ట్రంలో లక్ష దాటాయ్.. వైరస్‌తో 1,090 మంది మృతి