తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదల చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 183.10 కోట్ల నిధులు విడుదలకు పరిపాలన పరమైన అనుమతులిస్తూ ఆదేశాలిచ్చింది.
తిరుపతి నగరంలోని పలు కాలనీల్లో రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, మురుగు పారుదల వ్యవస్థల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ కమిషనర్‌కు ఆదేశాలిచ్చారు.
ఇదీ చదవండి:
SV Prasad Death: మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూత.. చంద్రబాబు సంతాపం