చెట్లను కాపాడటం వల్ల భవిష్యత్లో అవి మానవాళికి రక్షణ ఇస్తాయని తితిదే ఈవో జవహర్ రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 10 వేల మొక్కలను నాటే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కరకంబాడి రోడ్డులో నగరపాలక సంస్థ బృహత్తర ప్రణాళికలో భాగంగా నిర్మిస్తున్న రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్క నాటాలని ఈవో పిలుపునిచ్చారు. మొక్కలు నాటితే భావితరాలకు ఊపయోగపడతాయన్నారు.
ఇదీ చదవండీ... కొవిడ్ తగ్గాక.. పరీక్షలు నిర్వహిస్తాం: మంత్రి సురేశ్