- AMITH SHAH: అమిత్ షా పర్యటనలో మార్పులు.. సీఎంతో శ్రీవారి దర్శనం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఇవాళ సాయంత్రం తిరుపతికి రాగానే నేరుగా తిరుమలకు వెళ్లనున్నారు. సీఎం జగన్‌తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొంటారు. ఆదివారం మధ్యాహ్నం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- SOLAR POWER: సౌర విద్యుత్ కొనుగోలుకు.. ఏపీ ఈఆర్‌సీ అనుమతి
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి 7 వేల మెగావాట్ల సౌరవిద్యుత్ కొనుగోళ్లకు AP డిస్కంలకు ఈ.ఆర్.సీ అనుమతిచ్చింది. 2024 సెప్టెంబర్ నుంచి పాతికేళ్ల పాటు ఏడాదికి 15 వేల మిలియన్ యూనిట్ల మేర సెకీ నుంచి కొనుగోలు చేస్తామన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- WEATHER UPDATE: 15 నాటికి వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
దక్షిణ అండమాన్ సముద్రం ఆ పరిసర ప్రాంతాలపై ఇవాళ ఉదయం అల్పపీడనం ఏర్పడింది. నవంబరు 15 తేదీ నాటికి ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Vijayasai Reddy: ఎన్నికల్లో వైకాపాదే ఘన విజయం: ఎంపీ విజయసాయిరెడ్డి
కుప్పంతో పాటు పలుచోట్ల జరుగుతున్న ఎన్నికల్లో వైకాపాదే విజయమన్నారు(mp Vijayasai Reddy news) ఎంపీ విజయసాయిరెడ్డి. జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న రెండు ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి- ఏడుగురు మృతి
అసోం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. మణిపుర్‌లోని చురాచంద్‌పుర్ జిల్లా సింఘాట్ సబ్ డివిజన్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో అసోం రైఫిల్స్ కమాండింగ్ అధికారి కర్నల్ విప్లవ్ త్రిపాఠితో పాటు ఆయన భార్య, ఎనిమిదేళ్ల చిన్నారి సైతం ప్రాణాలు కోల్పోయారని రక్షణ శాఖ తన అధికార ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రేమికుడితో వెళ్లిన బాలికకు గుండు కొట్టించి.. ఊరేగించి..
ఒక వ్యక్తితో కలిసి వెళ్లిపోయిందన్న నెపంతో పద్నాలుగేళ్ల బాలికను దారుణంగా శిక్షించారు గ్రామస్థులు. గుండుకొట్టించి.. ముఖానికి నలుపు రంగు పూసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'అఫ్గాన్‌లో 75శాతం మంది బాలికలు మళ్లీ బడిబాట'
అఫ్గాన్‌లో బాలికలు తిరిగి పాఠశాలలకు(afghan girls education ) హాజరవుతున్నారని ఆ దేశ తాత్కాలిక విదేశాంగ మంత్రి తెలిపారు. పాకిస్థాన్ వార్తా సంస్థ డాన్ ఈ విషయాన్ని వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- SBI EMI: ఎస్బీఐ క్రెడిట్‌కార్డ్ వినియోగదారులకు షాక్
క్రెడిట్ కార్డు ఈఎంఐలపై ఎస్బీఐ (SBI EMI) కీలక ప్రకటన చేసింది. డిసెంబరు 1 నుంచి చెల్లింపులపై (SBI Credit Card Payment) రూ.99 (ట్యాక్సులు అదనం) ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వ్యాక్సిన్‌పై విముఖత.. దేశవాళీ క్రికెట్‌కు విజయ్ దూరం!
టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ మురళీ విజయ్.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొనట్లేదు. కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు అతడు సిద్ధంగా లేకపోవడమే కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'లైగర్' బాయ్స్ చిల్.. 'సత్యమేవ జయతే 2' ట్రైలర్
సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో లైగర్, ఊరికి ఉత్తరాన, హీరో, 1997, సత్యమేవ జయతే 2 చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.