కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. వైరస్ మొత్తం రాజమహేంద్రవరంలోనే తిష్ట వేసినట్లుగా ఉందన్న ఆయన.. అనవసర ప్రయాణాలు వద్దని ప్రజలను కోరారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని చెప్పారు.
ఆతిథ్యానికి గోదావరి జిల్లాలు పెట్టింది పేరన్న బుచ్చయ్య చౌదరి.. కరోనాకు మాత్రం ఆతిథ్యం ఇవ్వొద్దని కోరారు. నిబంధనలు పాటించి మహమ్మారిని తరిమికొట్టాలని సూచించారు. రాజమహేంద్రవరానికి కరోనా 'హాట్స్పాట్' గా కాకుండా సేఫ్స్పాట్గా మారుద్దామని ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: