ETV Bharat / city

'శాసనసభ నిర్ణయమే అంతిమం..మండలి వ్యతిరేకిస్తే పట్టించుకోనవసరం లేదు' - స్పీకర్ తమ్మినేని సీతారాం వార్తలు

ద్రవ్య వినిమయ బిల్లులో ప్రజల ద్వారా ఎన్నుకోబడిన శాసనసభదే అంతిమ నిర్ణయమని స్పీకర్​ తమ్మినేని సీతారాం అన్నారు. మండలిలో మనీ బిల్లును తెదేపా అడ్డుకోవడం సరికాదన్నారు.

speaker tammineni sitaram in rajamahendravaram
తమ్మినేని సీతారాం, సభాపతి
author img

By

Published : Jun 20, 2020, 5:28 PM IST

'శాసనసభలో ఒక నిర్ణయం తీసుకున్నాక అది అంతిమ నిర్ణయం అవుతుంది. దానిని శాసనమండలి వ్యతిరేకిస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెదేపా నేతలు ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకున్నారంటే వారి ఆలోచనా విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు అమలు చేయడం వారికి ఇష్టంలేనట్లుగా ఉంది' - తమ్మినేని సీతారాం, సభాపతి

మండలి నిర్ణయంతో పనిలేదు

ఎంపీ భరత్‌, తనతో సహా అనేకమంది బీసీలకు ముఖ్యమంత్రి జగన్‌ మంచి అవకాశాలు కల్పించారని చెప్పారు. బడ్జెట్​లోనూ అధిక శాతం కేటాయింపులు జరిపారన్నారు. గెలిచే అవకాశం లేనప్పుడు దళిత సామాజిక వర్గానికి చెందిన వారిని రాజ్యసభ ఎన్నికల్లో ఎలా పోటీకి నిలబెట్టారని తెదేపా అధినేత చంద్రబాబును స్పీకర్​ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ద్రవ్య వినిమయ బిల్లులో ప్రజల ద్వారా ఎన్నుకోబడిన శాసనసభదే అంతిమ నిర్ణయమన్న సభాపతి.. మనీ బిల్లును అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ విషయంలో శాసన మండలి నిర్ణయాన్ని పట్టించుకోనవసరం లేదన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును తెలుగుదేశం అడ్డుకుందని.. సంక్షేమ పథకాలు అమలు చేయడం తెదేపా నేతలు ఇష్టం లేదని విమర్శించారు.

బీసీలను రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బీసీలపట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. బలహీనవర్గాలు, దళితులు, మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. బీసీ నేతలైన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణలకు రాజ్యసభ ఎంపీలుగా అవకాశం ఇవ్వడంపై.. రాజమహేంద్రవరంలో ఆ పార్టీ నేతలు జ్యోతిభాపూలే విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎంపీ భరత్​తో కలిసి శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవీ చదవండి...

గత ప్రభుత్వం చేసిన తప్పులనే వైకాపా ప్రభుత్వం చేస్తోంది: రావెల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.