తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని వైశ్య సేవా సదనం భూములకు, దేవదాయ శాఖకు సంబంధం లేదని.... సదనం ప్రతినిధులు చెప్పారు. దేవదాయ శాఖ రిజిస్టర్ సెక్షన్ 43లో సదనం భూములు నమోదైనట్టు తమకు తెలీదని వైకాపా నగర కోర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ భూములు అమ్మి పేదల విద్యా వ్యాప్తికి సేవ చేసే అవకాశం వీలునామాలో పొందు పరిచారని తెలిపారు.
అలాగే జీవో 1098 ప్రకారం దేవదాయ శాఖ నుంచి మినహాయింపు ఉందన్నారు. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం తమ నుంచి కొనుగోలు చేసి 14 కోట్ల 22 లక్షల రూపాయలు చెల్లించిందని ....ఈ వ్యవహారంలో ఎలాంటి వివాదానికి తావు లేదని వైకాపా నగర శివరామ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: 'కాపులను మోసగించేవారే...ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నారు'