ETV Bharat / city

Fine: ప్రైవేటు ఆసుపత్రిలో అధిక ఫీజు..రూ.75.88 లక్షల జరిమానా

author img

By

Published : Jun 12, 2021, 7:29 PM IST

కరోనా చికిత్సకు ఓ రోగి నుంచి కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రి అదనంగా వసూలు చేసిన రూ.10.84 లక్షలపై ఆరోగ్యశ్రీ ట్రస్టు విచారణ జరిపి రూ.75.88 లక్షల భారీ జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి ఆసుపత్రి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇప్పించింది.

penality on private hospital
penality on private hospital

కరోనా చికిత్సకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుము కంటే భారీ మొత్తాన్ని అదనంగా వసూలు చేసినందుకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి భారీ జరిమానా విధించారు. కాకినాడకు చెందిన ఓబిలిశెట్టి సత్యనారాయణను గత నెల 14న సాయిసుధ ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్స నిమిత్తం చేర్పించారు. తర్వాత అతడు చికిత్స పొందుతూ మృతి చెందారు. చికిత్సకు మొత్తం రూ.14 లక్షలు వసూలు చేశారని బాధితుడి కుటుంబసభ్యులు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసుస్టేషన్‌లో క్రిమినల్‌ కేసులు కూడా నమోదయ్యాయి.

ఈ వ్యవహారంపై శుక్రవారం కలెక్టరేట్‌లో ఆరోగ్యశ్రీ ట్రస్టు జిల్లా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌, సంయుక్త కలెక్టర్‌ (అభివృద్ధి) కీర్తి అధ్యక్షతన విచారణ నిర్వహించారు. దీనికి ఆసుపత్రి యాజమాన్య ప్రతినిధులు హాజరయ్యారు. విచారణ అనంతరం బాధిత కుటుంబం నుంచి చికిత్స నిమిత్తం రూ.3.16 లక్షలే తీసుకోవాల్సి ఉండగా.. రూ.10.84 లక్షలు అదనంగా వసూలు చేసినట్లు నిర్ధారించారు. అదనంగా వసూలు చేసిన సొమ్ముకు ఏడు రెట్లు.. అంటే, రూ.75.88 లక్షల జరిమానా విధించారు. దాంతో ఆసుపత్రి యాజమాన్యం ఆ మొత్తానికి చెక్కును కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డికి అందజేసింది. దాంతోపాటు.. బాధిత కుటుంబం నుంచి అదనంగా వసూలు చేసిన రూ.10.84 లక్షలను వారికి తిరిగి ఇచ్చేందుకు మరో చెక్కును కలెక్టరేట్‌లో అందజేసింది.

ఇవీ చదవండి:

రైతు ఆవిష్కరణ.. రూ.25వేలకే ట్రాక్టర్!​

'పదేళ్లు కాపురం చేశాడు..ఇప్పుడు వదలించుకోవాలనుకుంటున్నాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.