ఇసుక రవాణాకు సంబంధించి తెలుగుదేశం చేసిన ఆరోపణలపై రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. తన అనుచరులు ఇసుక అక్రమాలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఛార్జీషీట్ విడుదల చేయడం సరకాదని అన్నారు. వాటిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని భరత్ సవాల్ విసిరారు. మరో వారం రోజుల్లో రాష్ట్రంలో ఇసుక కొరతకు తావు ఉండదని చెప్పారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుకు ప్రాధాన్యం ఇస్తూనే ఆంగ్ల బోధన సాగుతుందని వివరించారు. ఆంగ్ల బోధన విధానంపై ప్రతిపక్షాలు మాట్లాడుతున్న తీరు సరికాదని ఎంపీ భరత్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: