ETV Bharat / city

ఎమ్మెల్యే గారూ గెలిచాక ఇన్నేళ్లకు వస్తే మా సమస్యలెలా తెలుస్తాయి.. 'గడప గడప'లో మహిళ నిలదీత

MLA Kondeti: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ దగ్గరకు వచ్చిన నేతలను నిలదీస్తున్నారు. మా సమస్యలు ఎప్పుడు తీరుస్తారని గట్టిగా అడుగుతున్నారు. ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. వాళ్లు వినడం లేదు. ఎప్పుడో గెలిచి ఇప్పుడొస్తే మా సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు. ప్రతిచోట ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

MLA Kondeti
MLA Kondeti
author img

By

Published : May 15, 2022, 1:38 PM IST

MLA Kondeti: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో కోనసీమ జిల్లా పి.గన్నవరం శాసన సభ్యుడికి చుక్కెదురైంది. కొండుకుదురు గ్రామంలో ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును మహిళ గట్టిగా నిలదీసింది.

ఎమ్మెల్యే గారూ !! గెలిచాక ఇదే రావడం..ఇక సమస్యలెలా తెలుస్తాయి?..గడపగడపకులో మహిళ నిలదీత

మాకు ఇక్కడ వంతెన కావాలని ఎప్పటినుంచో అడుగుతున్నా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ఎదుట మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. 'నా దృష్టికి ఎప్పుడు ఈ సమస్య తీసుకురాలేదని' ఎమ్మెల్యే చిట్టిబాబు సమాధానం ఇవ్వగా.. ఆగ్రహించిన ఆమె.. మీరు నెగ్గిన తర్వాత ఇప్పుడే రావడం.. అందుకే అడుగుతున్నామంటూ గట్టిగా జవాబు చెప్పింది. అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయని.. ఇప్పటికైనా వంతెన నిర్మించాలని ఆ మహిళ ఎమ్మెల్యేకు మొర పెట్టుకుంది. మరోపక్క విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయాయని ఆ మహిళా ఎమ్మెల్యేకు చెప్పగా.. వివరణ ఇచ్చేందుకు యత్నించిన చిట్టిబాబు విఫలమయ్యారు. గతంలో మీ ఇంట్లో ఎన్ని ఫ్యానులు ఉన్నాయి... ఇప్పుడు విద్యుత్ వాడకం పెరిగిందని.. అందుకే బిల్లు ఎక్కువ వచ్చిందంటూ ఎమ్మెల్యే ఆమెకు చెప్పి శాంతపరచాలనుకున్నారు... అందుకు ఆమె వెరవకుండా.. ఇంట్లోకి వచ్చి చూసుకోండి ఎన్ని ఫ్యానులు ఉన్నాయో మీకే తెలుస్తుందని బదులిచ్చింది.

ఇవీ చదవండి :

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.