రాష్ట్రంలో పర్యటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని... మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ చెప్పారు. జిల్లాల్లో పర్యటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు, పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామని వివరించారు. ఉభయగోదావరి జిల్లాలను పర్యటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని హామీఇచ్చారు. రాజమహేంద్రవరంలో ఉభయగోదావరి జిల్లాల పెట్టుబడిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గోదావరి జిల్లాల్లో ఎకోటూరిజం, ఆధ్యాత్మిక, నదీ, సాగర ప్రాంతాల పర్యటకాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కోనసీమ ప్రాంతంలో సందర్శకులను ఆకర్షించేందుకు అగ్రి టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు.
ఇదీ చదవండి : 'ఏం చేశారని కడప జిల్లాలో పర్యటిస్తున్నారు..?'
'గోదావరి జిల్లాలను పర్యటకంగా అభివృద్ధి చేస్తాం' - latest news of AP Tourisam
ఉభయగోదావరి జిల్లాలను పర్యటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. రాజమహేంద్రవరంలో ఉభయగోదావరి జిల్లాల పెట్టుబడిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.