ఈరోజు ఉదయం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజుపేట తండా గ్రామ శివారులో కృష్ణ నాయక్‌కు చెందిన పొలంలో చిరుత కనిపించింది. పంటకు రక్షణ కోసం ఏర్పాటు చేసిన ముళ్లకంచెలో చిరుత ఇరుక్కుంది. చిరుతను రక్షించేందుకు అటవీశాఖ అధికారులు శ్రమించారు. ముళ్లకంచె నుంచి తప్పించేందుకు గంటల తరబడి యత్నించారు. ఎట్టకేలకు చిరుతను సురక్షితంగా బోనులో బంధించారు. ఈ క్రమంలో ఇద్దరు అటవీశాఖ సిబ్బందికి గాయాలైన విషయం తెలిసిందే.
ఇవీ చూడండి: తెలంగాణ : ముళ్లకంచెలో చిరుత... ఎట్టకేలకు చిక్కిందిలా