ఈ నెల 7న ముఖ్యమంత్రి జగన్ దిశా పోలీస్ స్టేషన్ను రాజమహేంద్రవరంలో ప్రారంభిస్తారని హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. దీనితో పాటు ప్రతి జిల్లాలోనూ దిశా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దిశా చట్టం అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. పోలీసులకు శిక్షణ కూడా ఇస్తున్నామని చెప్పారు. మహిళా భద్రతపై ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నారని స్పష్టం చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి... ఏపీలోనే సంవత్సరానికి 12 నుంచి 15 వేల కేసులు నమోదు అవుతున్నాయన్నారు. శిక్ష వెంటనే పడుతుందన్న భయంతో నేరాలు తగ్గుతాయని స్పష్టం చేశారు. అనేక రాష్ట్రాలు దిశా చట్టం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాయన్నారు.
ఇవీ చదవండి....ఆంగ్ల మాధ్యమంపై విచారణ సోమవారానికి వాయిదా