ETV Bharat / city

ఎన్టీఆర్ విగ్రహాలపై చెయ్యి పడిందో...ఖబడ్దార్ : గోరంట్ల

ఎన్టీఆర్, పీవీ ఘాట్లు ధ్వంసం చేస్తామని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఖండించారు. ఎన్టీఆర్ విగ్రహాలపై చెయ్యిపడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఎన్టీఆర్ పేరు చెప్పి ఓట్లు అడిగేవారంతా...ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఘాట్లు, విగ్రహాలు కూలుస్తామనడం సరికాదని హితవు పలికారు.

Gorantla butchaiah choudary
Gorantla butchaiah choudary
author img

By

Published : Nov 26, 2020, 4:26 PM IST

ఎన్టీఆర్ విగ్రహంపై చెయ్యి పడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. ఎన్టీఆర్​కు భారత రత్న ఇవ్వడం ఇప్పటికే ఆలస్యమైందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పేరు చెప్పి తెలంగాణలో ఓట్లు అడిగేవారంతా ఆయనకు భారతరత్న ఇవ్వమని డిమాండ్ చేయాలని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహామహుల విగ్రహాలు కూలుస్తామనడం సరికాదని గోరంట్ల హితవుపలికారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్, పీవీ నరసింహారావులపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను గోరంట్ల తీవ్రంగా ఖండించారు. భావస్వేచ్ఛను దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహా వ్యక్తి ఎన్టీఆర్ అని గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు.

ఇదీ చదవండి : 'నిజంగా ప్రేమే ఉంటే.. పీవీ, ఎన్టీఆర్​కు భారతరత్న ఇవ్వండి'

తెలంగాణ: 'అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్​ స్పందించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.