గోదావరి వరదతో కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు నెలరోజులుగా జలావాసం చేస్తున్నారు. గత నెల 11న ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన మొదలు...నేటి వరకు లంక గ్రామాలు వరద నీటిలోనే నానుతున్నాయి. ప్రస్తుతం ఎగువన వరద ఉద్ధృతి తగ్గుతున్నప్పటికీ కోనసీమ ప్రాంతంలో మాత్రం ప్రజలు జలదిగ్బంధంలోనే ఉన్నారు. నిత్యావసరాలు తెచ్చుకునేందుకు పడవలనే ఆశ్రయించాల్సి వస్తోందని లంక వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల నుంచి 2 లక్షల 86 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం జలాశయం 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 2 లక్షల 23 వేల క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా.... ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి నీటినిల్వ 215.80 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 214.84 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి జరుగుతోంది. కరెంటు ఉత్పత్తితో 62 వేల 991 క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది.
ఇవీ చదవండి: