తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం తాడితోటలోని ఓ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. వస్త్రాలన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 20 లక్షల రూపాయలు మేరకు నష్టం జరిగినట్లు అంచనా. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి షార్ట్ సర్కూట్ కారణమని అధికారులు నిర్ధరించారు.
ఇదీ చదవండి...మంచి నీటి ట్యాంకులో పురుగుల మందు కలిపారు!