CAR HIT TIGER: అటవీ జంతువులు దారి తప్పి పట్టణాలలోకి రావడం చూస్తుంటాం. కానీ అటవీ ప్రాంతంలో ఉన్నా కూడా ఆ పులికి పెద్ద కష్టమే వచ్చింది. ఎంత ఆకలిగా ఉందో ఏమో, అటవీ ప్రాంతంలో ఆహారం కోసం అని వచ్చి ప్రమాదానికి గురైంది. గాయపడిన పెద్దపులి కోసం అటవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇంతకీ ఏం జరిగిందంటే: నంద్యాల జిల్లా రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని అహోబిలం నల్లమల అడవుల్లో అహోబిలం వెళ్లే రోడ్డులో పెద్దపులిని కారు ఢీకొట్టింది. అటవీ ప్రాంతంలో రహదారిపై ఉన్న కోతులపై దాడి చేసేందుకు ఈ పులి రోడ్డు పైకి వచ్చింది. అదే సమయంలో అహోబిలం వైపునకు వెళుతున్న కారు వేగంగా వచ్చి పెద్ద పులిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పెద్దపులి గాయపడి అడవిలోకి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే తొలుత ఈ ఘటనను దాచి పెట్టేందుకు అటవీ శాఖ అధికారులు చాలా వరకు ప్రయత్నించారు. ఈ ఘటనలో కారుకు డ్యామేజ్ కాగా పెద్దపులి సైతం గాయపడింది. దీనిపై సమాచారం అందుకున్న రుద్రవరం రేంజ్ సబ్ డీఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి, రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు, డిప్యూటీ రేంజ్ అధికారి ముత్తు జావలి, సిబ్బంది, ప్రొటెక్షన్ వాచర్లు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. గాయపడిన పెద్దపులి కోసం అటవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
కుడి 'కన్ను' అలా - ఎడమ 'ఐ' ఇలా - వెరైటీ ఆడ చిరుతను చూశారా? - Unique Leopard