తెలంగాణలోని సిద్దిపేట జిల్లా, పొన్నాలకు చెందిన కోట పోచయ్య, పోచమ్మ దంపతులు కుమారుడితో కలిసి మల్లాపూర్‌లో నివాసం ఉంటున్నారు. నగరంలో గాడిద పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు మంగళవారం కోతి పిల్లను గొలుసుతో కట్టి ఆడిస్తూ భిక్షాటన చేశాడు. గమనించిన కంపాశనేట్ సొసైటీ ఫర్ అనిమల్స్ ఫౌండర్, ఛైర్‌పర్సన్ నాగారం ప్రవళిక... ఆ బాలుడిని, కోతిపిల్లను తీసుకొని ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు బాలుడి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి వారందరికీ కౌన్సెలింగ్ ఇప్పించారు. కోతిపిల్లతోపాటు బాలుడు, అతడి తల్లిదండ్రులను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. విచారణ జరిపిన అధికారులు బాలుడి కుటుంబానికి రూ.10వేల జరిమానా విధించారు. కోతిపిల్లను చెంగిచర్ల అటవీ ప్రాంతంలో వదిలేశారు.
కోతులతో తస్మాత్ జాగ్రత్త.. లేకపోతే జరిమానా తప్పదు! - fine for monkey Detention in hyderabad news
కోతి పిల్లను గోలుసుతో కట్టేసి భిక్షాటన చేసినందుకు రూ.10వేల జరిమానా కట్టాల్సి వచ్చిన ఘటన హైదరాబాద్ ఉప్పల్‌లో చోటుచేసుకుంది.
![కోతులతో తస్మాత్ జాగ్రత్త.. లేకపోతే జరిమానా తప్పదు!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4925349-708-4925349-1572571720581.jpg?imwidth=3840)