ETV Bharat / city

Farmers Problem: మేము ఏం చేయాలి.. మాకు దారేది.. రైతుల ఆవేదన - తూర్పు గోదావరి జిల్లాలో ధాన్యం డబ్బులు అందని రైతులు

Farmers Problems in Cultivation: రైతుల కష్టాలకు అంతేలేదు...ఆరుగాలం శ్రమించినా పంటచేతికి అందుతుందో లేదోనన్న భయం ఓ వైపు వెంటాడుతుంటే... మరోవైపు పండించిన పంటను అమ్ముకున్నా.. చేతికి సొమ్ము అందని పరిస్థితి రైతులకు పట్టి పీడిస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మి నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు రైతులకు డబ్బులు చేతికందలేదు. అధికారులు ఇంకా ఆ పత్రాలు లేవు.. ఈ పత్రాలు లేవంటూ తిప్పించుకుంటూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో చావాలో.. బతకాలో తెలియడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Farmers Problems in Cultivation
ధాన్యం డబ్బులేవి..?
author img

By

Published : Feb 18, 2022, 11:14 AM IST

ధాన్యం డబ్బులేవి..?

Farmers Problems in Cultivation: పంట రైతు చేతికందాలంటే ఎన్నో అడ్డంకులు దాటాలి. భారీ వర్షాలు, వరదలు, కోతల సమయంలో తుపానును నెట్టుకుని చివరికి అందిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్న అన్నదాతలకు.. నెలలు గడుస్తున్నా కష్టార్జితం చేతికి అందని పరిస్థితి. ఖరీఫ్ లో ధాన్యం డబ్బులు ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో రబీ పంట సాగుకు నానా తంటాలు పడుతున్నారు.చేతిలో చిల్లిగవ్వ లేక రైతన్నలు సతమతమవుతున్నారు. ఆర్బీకేల్లో ధాన్యం అమ్మినా.. రైతుల వివరాలు పోర్టల్ లోకి ఎక్కక.. మీ భూమి కనిపించడం లేదన్న మాటలు వారిని మరింత ఆవేదనకు గురి చేస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ధాన్యం రైతుల దీనగాథ ఇది.

"ఆరు లక్షలు అప్ప తెచ్చి తొలకరి చేను ఊడ్చాను. ప్రభుత్వం నుంచి రావల్సిన సొమ్ము ఇంతవరకూ రాలేదు. అధికారులు రేపు,మాపు అంటున్నారు. భూమి కనిపించడం లేదంటున్నారు. భూమి మీద కాకుండా ధాన్యాన్ని ఎక్కడ పండించాను? చేనును పిండే యాలా ? పురుగుల మందు తాగి చావోలో మీరే చెప్పండి. ఇప్పుడు పంట వేయడానికి కనీసం అప్పు కూడా పుట్టని పరిస్థితి. ఇలాంటి స్థితిలో మేము ఏం చేయాలి? మాకు దారేది.?"

ఇదీ చదవండి : Marijuana Seized : బ్యూటీషియన్ ముసుగులో గంజాయి దందా

East Godavari Farmers Problems :తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం కొత్తూరుకు చెందిన కౌలు రైతు కేతా సూర్యనారాయణ ఆవేదన ఇది. కౌలుకు వరి సాగు చేసి, అనేక ఒడిదొడుగులు ఎదుర్కొని పండించిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మి సుమారు 3 నెలలు గడుస్తున్నా..ఇంత వరకు ఇతని చేతికి పైసా దక్కలేదు. డబ్బులు మాట అటుంచితే.. అమ్ముకున్న పంట, భూమి వివరాలు కనీసం ప్రభుత్వ పోర్టల్ లో కనిపించడం లేదు. సూర్యనారాయణతో పాటు జిల్లాలో ఇంకా ఖరీఫ్ ధాన్యం విక్రయించిన వేల మంది రైతులది ఇదే పరిస్థితి. ధాన్యం విక్రయించిన 21 రోజుల్లోనే నగదు రైతుల ఖాతాలకు చెల్లించాలన్న ప్రభుత్వ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ధాన్యం సేకరణ పోర్టల్ లో ధాన్యం అమ్మిన రైతుల వివరాలు లేకపోవడంతో వారిని ఆందోళనకు గురిచేస్తోంది.

" నాలుగెకరాల చేను ఊడ్చాను. 150బస్తాలు అమ్మి 3నెలలు అవుతుంది. ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. అప్పు కూడా ఎక్కడా దొరకటం లేదు. నా భూమి ఈక్రాప్ లో పడలేదంటున్నారు.అసలు భూమే లేదంటున్నారు. మరి నా భూమి ఏమయిందో తెలియటం లేదు. నేనేం చేయాలి ఇప్పుడు ?" -వీర్రాజు, కౌలు రైతుకొత్తూరు, తూ.గో. జిల్లా

" పిండి బస్తా ధర 1200 నుంచి 1900 చేశారు. ధాన్యం రేటుకు పిండి బస్తా రేటుకు సంబంధం లేదు. ఆర్బీకే వాళ్లు పిండి బస్తాలకు డబ్బు చెల్లించమంటున్నారు. 21రోజుల తర్వాత వెళ్లినా కూడా ఈక్రాప్ అవ్వలేదు మీ భూమి కనిపించడం లేదు అంటున్నారు. భూమి లేకుండా ధాన్యాన్ని ఎలా కొన్నారు. అప్పులు చేసి పండించినా కనీసం ఖర్చులు కూడా రావడం లేదు. మా పరిస్థితి దీనంగా ఉంది. " -బాపిరాజు, కౌలు రౌతు, మాలపాడు, తూ.గో. జిల్లా

ఇదీ చదవండి : గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై నేడు ప్రత్యేక సమావేశం

జిల్లాలో ఖరీఫ్‌లో వరి సాగుపై ప్రకృతి విపత్తుల ప్రభావం తీవ్రగంగా పడింది. గోదావరి వరదలు, అధిక వర్షాలు, వరి పంటను ముంచెత్తాయి. కోతల సమయంలో తుపాను విరుచుకు పడింది. అతి కష్టంపై దక్కిన పంటను కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించారు. ఖరీఫ్ ధాన్యం నగదు ఇప్పటికీ అందని రైతులకు రబీ సాగు ముందుకు సాగడం లేదు. ఎరువుల కొరత, నీటి ఎద్దడికి తోడు పెట్టుబడి ఖర్చులు లేకపోవడంతో కౌలుదారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రామచంద్రపురం, అనపర్తి, మండపేట ప్రాంతాల్లో ఖరీఫ్ నగదు అందని రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. తమ వివరాలు పోర్టల్ లో ఎందుకు నమోదు చేయడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

"ఈక్రాప్ లో భూమి కనిపించడంలేదంటున్నారు. ధాన్యం దూసి 3నెలలు అయ్యింది. అప్పులు చేసి పండించాము. ఆర్థికంగా భారంగా మారింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాము. " -సత్యదుర్గారావు, కౌలు రైతు,శ్రీరాములు, నీటి సంఘం మాజీ ఉపాధ్యక్షుడు

" ధాన్యం దూసి 3నెలలు అయ్యింది. ఇంతవరకూ మాకు పైసా ముట్టలేదు. ఈ క్రాప్ లో భూమి లేదంటున్నారు. చావాలో బ్రతకాలో తెలియని స్థితిలో ఉన్నాం." -గరికపాటి సూర్యనారాయణ, రైతు

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ సీజన్​లో ఇప్పటివరకు 1315 కోట్ల విలువైన ధాన్యం రైతుల నుంచి పౌరసరఫరాల శాఖ సేకరించింది. 313 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ నగదు తమ ఖాతాల్లో ఎప్పుడు పడుతుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి :

Woman Code to Win Contest: సవాళ్లతో సావాసం.. అదే ఆమె విజయ మంత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.