ETV Bharat / city

మన్యంలో ఎన్నికల పోలింగ్‌ సమయం కుదింపు - మన్యంలో పోలింగ్‌ సమయాన్ని కుదించిన ఎస్ఈసీ తాజా న్యూస్

తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని రంపచోడవరం, ఎటపాక డివిజన్ల పరిధిలో 186 పంచాయతీలకు ఎన్నికల పోలింగ్‌ సమయాన్ని కుదిస్తున్నట్లు ఎస్ఈసీ రమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి.. రాసిన లేఖపై స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Election polling in East Godavari district agency area ‌ Time shrink
మన్యంలో ఎన్నికల పోలింగ్‌ సమయం కుదింపు
author img

By

Published : Feb 5, 2021, 7:20 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని రంపచోడవరం, ఎటపాక డివిజన్ల పరిధిలోని 11 మండలాల్లో.. 186 పంచాయతీలకు ఎన్నికల పోలింగ్‌ సమయాన్ని కుదిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డి. మురళీధర్‌రెడ్డి రాసిన లేఖపై స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మన్యంలో ఈనెల 17న నిర్వహించనున్న ఎన్నికల పోలింగ్‌ సమయాన్ని ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా తెదేపా కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.