ETV Bharat / city

కొవిడ్​ కేసులు లక్ష....అప్రమత్తతే రక్ష

తూర్పుగోదావరి జిల్లాలో కొవిడ్ ఉద్ధృతి తగ్గడంలేదు. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌ ప్రారంభంలో కేవలం నాలుగు కరోనా కేసులున్న జిల్లా గత మూడు నెలలుగా కేసుల్లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. జూన్‌ నుంచి కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో లక్ష కేసులు దాటేశాయి. 91 వేలమందికి పైగా కొవిడ్ నుంచి కోలుకోగా, 503 మరణాలు సంభవించాయి.

Easti godavari district
Easti godavari district
author img

By

Published : Oct 5, 2020, 10:43 PM IST

కరోనా మహమ్మారి తీవ్రత తగ్గడం లేదు.. జిల్లాలో కేసుల సంఖ్య లక్ష దాటింది. రాష్ట్రంలో 13 జిల్లాలతో పోలిస్తే వైరస్‌ తీవ్రత ఇక్కడే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్‌ కట్టడికి యంత్రాంగం చర్యలు చేపడుతున్నా.. పరిస్థితి అదుపులోకి రావడంలేదు. ప్రజల్లో చైతన్య లోపం.. పీడితులు స్వీయ జాగ్రత్తల లేమి వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోంది. కరోనా వైరస్‌ జిల్లాలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో వ్యాప్తి తక్కువగానే ఉన్నా.. నెలలు గడుస్తున్న కొద్దీ తారస్థాయికి చేరింది. మూడు నెలలుగా జిల్లాలో పరిస్థితి అదుపు తప్పేలా చేసింది.

జిల్లాలోని 64 మండలాల్లో 55 లక్షల జనాభా ఉండగా.. కరోనాకు సంబంధించి ప్రభుత్వ పరీక్ష కేంద్రాల్లోని లెక్కలే వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేటుగా పరీక్షలు చేయించుకునేవారు కొందరు.. సొంత, ప్రైవేటు, ఇంటి వైద్యం పొందుతూ వైద్యారోగ్యశాఖ లెక్కల్లోకి రానివారు ఎందరో ఉంటున్నారు.. అనుమానిత లక్షణాలు వెలుగు చూసిన వెంటనే వైద్యులను ఆశ్రయించడం లేదు. ప్రాణాలమీదికు వచ్చిన తర్వాత ఆసుపత్రులకు పరుగులుతీస్తున్నారు. లక్షణాలున్నా పరీక్ష చేయించుకోకపోవడం, స్వీయ జాగ్రత్తలు పాటించకపోవడం వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోంది. జిల్లాలో తొలి పాజిటివ్‌ కేసు రాజమహేంద్రవరంలో.. తొలి మరణం పెదపూడి మండలంలోని జి.మామిడాడలో నమోదైంది. ఇలా మహమ్మారి జిల్లా మొత్తాన్ని చుట్టేసింది. మార్చిలో నాలుగు కేసులతో సరిపెట్టినా.. ఏప్రిల్‌, మే నెలల్లో పరిస్థితి అదుపులో ఉన్నా.. జూన్‌ నుంచి వేల సంఖ్యలో కేసులు వచ్చాయి. జులై నుంచి పరిస్థితి అదుపు తప్పింది. దీంతో తొలి పది వేల కేసుల నమోదుకు 148 రోజులు పట్టినా.. తర్వాత 90 వేల కేసులకు కేవలం 49 రోజులే పట్టడం గమనార్హం. సూపర్‌ స్ప్రెడర్‌ ద్వారా జి.మామిడాడలో అత్యధికంగా ఒకరి నుంచి 127 మందికి వైరస్‌ వ్యాప్తిచెందినట్లు అధికారులు గుర్తించారు. రాయవరం మండలంలోని చెల్లూరుకు ఇదే గ్రామం నుంచి వైరస్‌ వ్యాపించి 114 మందిని చుట్టేసింది.

వలసొచ్చిందిలా...

లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత జిల్లాకు విదేశాలు, దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వలసలు పెరిగాయి. విమాన మార్గంలో 9,614, రైలు, బస్సు మార్గాల్లో 89,129 మంది వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చినవారే ఎక్కువ కావడం గమనార్హం.

మెరుగుపడిన వసతులు

కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కీలక వైద్యసేవలకు అవసరమైన సిబ్బందితోపాటు.. అనువైన వసతులు సమకూరాయి. అన్నిస్థాయిల్లో కలిపి 2,772 మంది వైద్య సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతించడం ఊరటనిచ్చింది. కాకినాడ జీజీహెచ్‌కు 1,034, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రికి 378, ప్రాంతీయ ఆసుపత్రుల్లో అమలాపురం 63, రామచంద్రపురం 50, తుని 51 చొప్పున ఆక్సిజన్‌ పరికరాలు అందించారు. సామాజిక వైద్యశాలల్లో కొత్తపల్లికి 25, రాజోలుకు 20, పెద్దాపురం 20, రంపచోడవరం 24 చొప్పున సమకూర్చారు. వీటిని సమర్థంగా నిర్వహిస్తే.. భవిష్యత్తు అవసరాలకు ఎంతగానో ఉపకరించనున్నాయి.

కాసులు పిండారు

జిల్లాలో కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రితోపాటు జీఎస్‌ఎల్‌, కిమ్స్‌లను కొవిడ్‌ సేవలకు కేటాయించారు. ఇవికాక 32 ప్రైవేటు ఆసుపత్రులను అనుమతించారు. కేసులు పెరగడంతో ఆక్సిజన్‌ బెడ్ల కొరత ఏర్పడింది. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ము చేసుకున్నాయి. ప్రస్తుతం బెడ్ల కొరత లేకపోవడంతో 17 ప్రైవేటు వైద్యశాలల్లో కొవిడ్‌ సేవలను కలెక్టర్‌ ఉపసంహరించారు.

ఆగని మరణాలు..

రాష్ట్ర కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ విభాగం ఆడిట్‌ ద్వారా నిర్ధారించిన కరోనా మరణాలు జిల్లాలో 503కు చేరాయి. కొవిడ్‌ లక్షణాలున్నా ఇతర అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలున్న మరణాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఆయా మరణాలు వెయ్యికిపైనే ఉన్నట్లు సమాచారం. కొవిడ్‌ తీవ్రత తగ్గిందని చెబుతున్నా రోజూ సంభవిస్తున్న మరణాలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

సమర్థంగా కొవిడ్‌ సేవలు

జిల్లాలో రోజుకు ఏడు వేల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రతి కొవిడ్‌ కేసును సరైన సమయంలో గుర్తించి, వారు ఇతరులతో కలవకుండా ఉండేలా చూడడంపైనే దృష్టిసారించాం. కొవిడ్‌తోపాటు ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాసపరమైన ఇబ్బందులు ఉన్నవారిని తక్షణమే ఆసుపత్రుల్లో చేర్పించి సకాలంలో వైద్యసేవలు అందించడంపై దృష్టిసారించాం. ఈ మూడింటిలోనూ జిల్లాలో రికవరీ రేటు ఆశాజనకంగా ఉంది. గతంతో పోలిస్తే జిల్లాలో పరిస్థితి కుదుటపడుతోంది. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సహకరిస్తే జిల్లాలో వైరస్‌ తీవ్రత మరింత తగ్గుతుంది. - కీర్తి చేకూరి, జిల్లా సంయుక్త కలెక్టర్‌

ఇదీ చదవండి ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు.. సేద్యపు శ్రామికుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.