Drinking water Problem: తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలోని సీతారాంపురం గ్రామంలో గ్రామస్థులు ధర్నా చేపట్టారు. గ్రామంలో వారం రోజులుగా మంచినీళ్లు రావడం లేదన్నారు. ఈ విషయాన్ని గ్రామస్థులు పంచాయతీ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదంటున్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారా అయినా నీళ్లు సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో జాతీయ రహదారి 216 పై బైఠాయించారు. తమ సమస్యను అధికారులు పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి : 'మీకు తెలుగుదేశం అండగా ఉంటుంది'.. మిస్బా కుటుంబానికి చంద్రబాబు భరోసా