పెళ్లంటే... పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు... ఇలా సంబరంగా ఉంటుంది. కానీ కరోనా దెబ్బకు ఇవేమీ లేకుండానే సాదాసీదాగా వివాహాలు జరిగిపోతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో రాజమహేంద్రవరం బాలాజీపేటలో ఓ జంట వివాహం నిరాడంబరంగా జరిగింది. రెండువైపుల నుంచి కేవలం 20 మందే పెళ్లికి హాజరవడం విశేషం. అది కూడా అందరూ మాస్కులు పెట్టుకుని... శానిటైజర్లు రాసుకుని పెళ్లి వేడుకను తిలకించారు.
తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకునేందుకు గతంలోనే ముహూర్తం పెట్టుకున్నామని... ఇంతలోనే కరోనా మహమ్మారి విజృంభనతో ఇలా సాదాసీదాగా జరుపుకోవాల్సి వచ్చిందని వరుడు చెప్పాడు.
ఇదీ చదవండి