Central on Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం మరో మెలిక పెట్టింది. సామాజిక, ఆర్థిక సర్వే మరోసారి నిర్వహించాలంటూ షరతులు విధించింది. డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్పై డీపీఆర్ తయారు చేయాల్సిందేనని నిబంధన తీసుకొచ్చింది. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో గడువు చెప్పాలని కేంద్ర జలశక్తి శాఖ కోరింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రూ. 15 వేల 668 కోట్ల వరకే తమ బాధ్యతని స్పష్టం చేసింది.
2022 ఫిబ్రవరి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేల 336 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని... అందులో రూ.12వేల 311 కోట్లు కేంద్రం తిరిగి చెల్లించినట్లు తెలిపింది. ఇంకో రూ.437 కోట్ల బిల్లుల్ని పోలవరం అథారిటీ పంపినట్లు వివరించింది. లోక్సభలో వైకాపా ఎంపీల ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేస్వర్ టుడు ఈమేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఇదీ చదవండి :