ETV Bharat / city

జూన్ 5న రాజమహేంద్రవరానికి.. భాజపా జాతీయ అధ్యక్షుడు - BJP national president JP Nadda news

జూన్ 5న రాష్ట్రంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. స్థానిక ఆర్ట్స్ కాలేజ్ కళాశాల ప్రాంగణంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలో జగన్ చేసిన సంక్షేమం కన్నా ప్రధాని మోదీ చేసిన సంక్షేమమే ఎక్కువగా కనిపిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపా జనసేన కూటమి అధికారంలోకి రావటం ఖాయమన్నారు.

జేపీ నడ్డా
జేపీ నడ్డా
author img

By

Published : May 15, 2022, 8:15 PM IST

వచ్చే నెల 5వ తేదీన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. స్థానిక ఆర్ట్స్ కాలేజ్ కళాశాల ప్రాంగణంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారన్నారు.

వైకాపా సర్కారు ఆదాయ వనరులు పక్కనపెట్టి అప్పులతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ చేసిన సంక్షేమం కన్నా ప్రధాని మోదీ చేసిన సంక్షేమమే ఎక్కువగా కనిపిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపా జనసేన కూటమి అధికారంలోకి రావటం ఖాయమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ కల్పన, ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.

ఇదీ చదవండి: 'తెలంగాణలో నిజాం ప్రభువును గద్దె దించేందుకు సిద్ధమవ్వండి..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.