YCP Leader Suicide Attempt : నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్దిపురం గ్రామంలో వైకాపా మండల నేత సురా శ్రీనివాసులు రెడ్డి గతంలో ప్రభుత్వానికి ఎకరా భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం ఇచ్చాడు. అయితే అప్పట్లో అధికారులు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎకరా భూమికి రావలసిన 15 లక్షల రూపాయల నగదు చెల్లించక పోగా.. తన సాగులో ఉన్న కొంత భూమిలో ప్రభుత్వ భూమిని ఉందని.. ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు.అధికారులు తీరుపై మనస్తాపానికి గురైన శ్రీనివాసులు రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతని వద్ద నుంచి పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. పురుగుల మందు డబ్బాను లాగే ప్రయత్నంలో జరిగిన తోపులాటలో శ్రీనివాసులు రెడ్డి స్పృహ కోల్పోయి పడిపోవడంతో ఆయన్ను నెల్లూరు ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి : Murder Case Revealed: ప్రేమ వ్యవహారంలో యువకుడి దారుణ హత్య..!