ETV Bharat / city

'బంగారు బుల్లోడు' సినిమాపై విశ్వబ్రాహ్మణ సంఘం ఆందోళన - నెల్లూరు కలెక్టరేట్ వద్ద విశ్వబ్రాహ్మణ సంఘం నిరసనలు

నెల్లూరు కలెక్టరేట్​ ఎదుట విశ్వబ్రాహ్మణ సంఘం ధర్నా చేపట్టింది. బంగారు బుల్లోడు సినిమాలో తమను అవమానిస్తూ, తమపై ప్రజలకు అపనమ్మకాన్ని పెంచే విధంగా సన్నివేశాలున్నాయని.. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటశేషయ్య ఆచారి ఆరోపించారు. వాటిని తొలగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

viswa brahmana sangham protests before nellore collectorate
నెల్లూరు కలెక్టరేట్ ఎదుట విశ్వబ్రహ్మణ సంఘం ఆందోళన
author img

By

Published : Jan 27, 2021, 8:05 PM IST

స్వర్ణకారులను అవమానించేలా బంగారు బుల్లోడు సినిమాను చిత్రీకరించారంటూ.. నెల్లూరులో విశ్వబ్రాహ్మణ సంఘం నిరసన వ్యక్తం చేసింది. అవమానకరంగా ఉన్న సన్నివేశాలను తొలగించాలంటూ.. కలెక్టరేట్ ఎదుట ఆ సంఘం నేతలు ఆందోళన నిర్వహించారు. సినిమా నిర్మాతలు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే థియేటర్ల వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

స్వర్ణకారులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా.. బ్యాంకుల్లో తనఖా పెట్టే బంగారు ఆభరణాలను తారుమారు చేస్తున్నట్లు సినిమాలో చూపించారని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటశేషయ్య ఆచారి మండిపడ్డారు. దేవుడి కోసం తయారు చేసే ఆభరణాల్లోనూ అవకతవకలకు పాల్పడ్డుతున్నట్లు చెప్పడాన్ని తప్పుపట్టారు. ఇలాంటి సన్నివేశాల వల్ల ప్రజలకు తమపై ఉన్న నమ్మకం పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం: నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.