ETV Bharat / city

ఈ దొంగ మామూలోడు కాదు.. బాబోయ్​! - crime news latest

'దొంగలందు ఈ దొంగ వేరయా'.. అని చెప్పేందుకు ఈ కేటుగాడు పక్కా సరిపోతాడు. నమ్మించి గొంతు కోయడం...అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఈ దొంగ. నమ్మించి.. దోచుకెళ్లాడు. ఇంతకీ ఆ మోసగాడు ఆడిన నాటకమేంటో తెలుసా?

ఈ దొంగ మాములోడు కాదు.. బాబోయ్​!
author img

By

Published : Oct 13, 2019, 9:04 PM IST

ఈ దొంగ మాములోడు కాదు.. బాబోయ్​!

నిన్నటికి నిన్న అనంతపురంలో ఓ వృద్ధురాలి వద్ద దొంగ నటనతో ఓ కేటుగాడు బంగారం దోచుకెళ్లాడు. అలాంటి ఘటనే ఇప్పుడు నెల్లూరులో జరిగింది. కానీ ఈ దొంగ ప్రభుత్వ ఉద్యోగి అవతారం ఎత్తాడు. పింఛను ఇప్పిస్తానంటూ..చెప్పేసరికి నమ్మింది వృద్ధురాలు. తీరా బంగారం దోచుకుని వెళ్లాక... చేసేదేమీ లేక లబోదిబోమంది.

బంగారం ఉంటే పింఛను రాదమ్మా!
నెల్లూరు జిల్లా ఏఎస్​ పేట మండలం మదరాబాదులో ఓ వ్యక్తి పింఛను నమోదు చేసే అధికారిని అంటూ తిరిగాడు. కాసేపయ్యాక అన్నపూర్ణ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లాడు. మీ భర్తకు వయసు అయిపోయింది.. నీ పేరుపై పెన్షన్ నమోదు చేస్తానని చెప్పాడు. ఫారం నింపాలి...ఫొటో కూడా దిగాలంటూ నమ్మించాడు కేటుగాడు. ఎలాగైతేనేం పింఛను వస్తుంది కదా అనుకుంది అన్నపూర్ణ. ఫొటో దిగేందుకు సిద్ధమైన వృద్ధురాలితో మెడలో బంగారం ఉంటే..పెన్షన్ రాదమ్మా అని చెప్పగానే నమ్మేసింది వృద్ధురాలు.

డబ్బులు కూడా!
బంగారం పక్కన పెట్టి ఫొటో దిగింది. ఆ దొంగ.. అది సరిపోదు అన్నట్లు..ఆన్​లైన్​లో నమోదు చేయాలంటే నాలుగు వేల రూపాయలు కావాలన్నాడు. అంత ఇచ్చుకోలేను బాబు అని మూడు వేల రూపాయలు తెచ్చి ఇచ్చింది అన్నపూర్ణ. వృద్ధురాలిని మోసగాడు కాసేపు మాటల్లో దింపి..బంగారంతో చెక్కేశాడు. బంగారం కనిపించకపోవడంతో..అవాక్కైన అన్నపూర్ణ స్థానికులతో విషయం చెప్పింది. అందరూ కలిసి ఎస్​పేట పోలీసు స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దొంగతనం చేయాలనుకుంటే కేటుగాళ్లు..ఎలాగైనా చేస్తారు. అవసరమైతే దశావతారాలు ఎత్తుతారు. ఎవరు వచ్చినా ముందు వెనక తెలుసుకుని నమ్మితే మంచిది. దొంగలతో తస్మాత్ జాగ్రత్త!

ఇదీ చదవండి:అవ్వా...నీరు కావాలంటూ వచ్చాడు..దోచుకెళ్లాడు!

Intro:మహిళ వద్ద బంగారు అపహరణBody:యాంకర్/పెన్షన్ ఇప్పిస్తానని వృద్ధురాలి వద్ద నుండి బంగారు సరూడు దొంగిలించిన ఘటన నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం మదరాబాదు చోటుచేసుకుంది.నిన్న ఓ వ్యక్తి పింఛన్ నమోదు కోసం వచ్చిన అధికారి అంటూ గ్రామంలోనీ వీధుల్లో తిరుగుతూ ఇంటి వద్దకు వచ్చాడు. ఇంట్లో ఇద్దరు వృద్ధులను గమనించిన అతను వాళ్ళ వద్దకు వెళ్లి తను పెన్షన్ నమోదు చేసుకునేందుకు తమ వద్దకు వచ్చానని వృద్ధురాలైన అన్నపూర్ణకు తెలిపాడు. ఆశతో అతన్ని గుడ్డిగా నమ్మిన వృద్ధురాలు మోసగాడి బుట్ట లో పడిపోయింది. మంచం పారాలు నింపాల్సి ఉందని వాటితో పాటు ఓ ఫోటో కూడా దిగాల్సి వస్తుందని అతను అన్నపూర్ణకు చెప్పాడు. అతను చెప్పిన మాటలను నమ్మిన అన్నపూర్ణ ఫోటో దిగేందుకు సిద్ధమైంది. మెడలో బంగారు అభరణాలు ఉంటే నీకు పెన్షన్ రాదని అతను తెలిపాడు. అందుకని మెడలోని సరుడును పక్కన పెట్టి అతని చేత ఫోటో తీయించుకుని. ఇంతటితో సరిపోదు అని ఫంక్షన్ పేరు ఆన్లైన్లో ఎక్కించేందుకు నాలుగు వేలు ఖర్చు అవుతుందని ఆ డబ్బు ఇవ్వాలని అతను కోరాడు. అంత డబ్బు తను ఇచ్చుకోలేని ఇంటి లోపలికి వెళ్లి రెండు వేల నగదును తీసుకొని వచ్చి అతనికి ఇచ్చింది. ఇదే అదునుగా భావించిన మోసగాడు తను డబ్బు కోసం ఇంటి లోపలికి వెళ్లడంతో తన మెడలో నుంచి పక్కన పెట్టి ఉన్న బంగారు సరుడు ను కొట్టేశాడు. అనంతరం అక్కడినుండి ఉడాయించాడు. తన బంగారు సరుడు కనిపించక పోవడంతో మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు అన్నపూర్ణ చుట్టుపక్కల పిల్లవాడిని పిలిపించింది జరిగిన విషయం వారికి చెప్పింది.దీంతో అందరూ కలిసి ఎస్ పేట లోని పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Conclusion:కిట్ నెం 698 కరీం‌ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఫోన్ నెం 9866307534
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.