ETV Bharat / city

LIVE SUICIDE: కళ్లెదుటే భార్య ఉరి..ఆపకుండా వీడియో తీసిన భర్త - ఏపీ 2021 వార్తలు

suicide
suicide
author img

By

Published : Sep 22, 2021, 4:42 PM IST

Updated : Sep 23, 2021, 10:14 AM IST

16:40 September 22

భార్య ఆత్మహత్య వీడియోను ఆమె బంధువులకు పంపిన పెంచలయ్య

LIVE SUICIDE: కళ్లెదుటే భార్య ఉరి..ఆపకుండా వీడియో తీసిన భర్త

కట్టుకున్న భార్యను కాపాడాల్సిన భర్తే.. ఆమె ఉరేసుకుంటుంటే కళ్లప్పగించి చూశాడు. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా.. ప్రాణాలు తీసుకుంటుంటే కాపాడతారు. ఉరేసుకుంటుంటే పగవాడైనా కాపాడేందుకు యత్నిస్తాడు. కానీ ఆ రాక్షసుడు ఆమెను ఆపకపోగా... ఏదో ఘనకార్యం చేసినట్లు ఆ ఘటనను వీడియోలో బంధించాడు. అంతేకాకుండా ఆ వీడియోను బంధువులందరికీ పంపి పైశాచిక ఆనందం పొందాడు. 

 నెల్లూరు జిల్లా ఆత్మకూరులో భార్య చనిపోతుంటే చూసి ఓ భర్త పైశాచిక ఆనందం పొందాడు. కళ్ల ముందే భార్య ఉరి వేసుకుంటుంటే.. ఆపాల్సిందిపోయి సెల్​ఫోన్​లో వీడియో తీశాడు. అది చాలదన్నట్లు ఆమె బంధువులకు ఆ వీడియోను పంపించాడు. బంధువుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 భార్య ఆత్మహత్యను వీడియో తీసిన పెంచలయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న కొండమ్మ మెప్మాలో రిసోర్స్ పర్సన్​గా పని చేస్తోంది. భార్య చనిపోయేందుకు ప్రేరేపించిన పైశాచిక భర్త పెంచలయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని మెప్మా సిబ్బంది కోరుతుంది.  

ఇదీ చూడండి: ENGINEERING STUDENT SUICIDE: ఎగ్​ దోశకు డబ్బులివ్వలేదని.. ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

Last Updated : Sep 23, 2021, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.