రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్‌పై ఉందని తెదేపా నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నెల్లూరులో.. తెదేపా నేతలు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, సాల్వేషన్ ఆర్మీ చర్చ్, బారా షహీద్ దర్గాలలో ప్రార్థనలు నిర్వహించారు.
మంత్రులు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని సోమిరెడ్డి విమర్శించారు. తిరుమలలో ఎప్పుడో పెట్టిన ఆచారాన్ని తుంగలోతొక్కడం సరికాదన్నారు. డిక్లరేషన్‌పై విస్తృతంగా చర్చ జరుగుతున్న సమయంలో తిరుమలకు వెళ్లిన ముఖ్యమంత్రి సంతకం పెడితే ఏం పోతుందని ప్రశ్నించారు. మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే సీఎం పట్టీపట్టనట్లు వ్యవహరించటం దురదృష్టకరమన్నారు. దేవాలయాలపై దాడులను అరికట్టేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టాలని కోరారు.
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు సరికాదని మాజీమేయర్ అబ్దుల్ అజీజ్ అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న కొడాలి నాని పౌరసత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : ఎస్పీ బాలు మరణంపై తెదేపా నేతల దిగ్భ్రాంతి