నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నందున కఠినమైన ఆంక్షలు అమలు చేయనున్నట్లు ఆర్.డి.ఓ చైత్ర వర్షిని తెలిపారు. రేపటి నుంచి కట్టుదిట్టమైన కర్ఫ్యూ అమలులో ఉంటుందని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపార దుకాణాలకు అనుమతి ఇస్తున్నట్లు వివరించారు.
బయట తిరిగే వారు తప్పక మాస్కులు ధరించాలని తెలిపారు. అలా ధరించక పోతే 100 రూపాయల ఫైన్ వేస్తామని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఏ ఒక్కరూ బయటకు రాకూడదని, అనవసరంగా బయటకు వస్తే.. చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిబంధనలను పోలీసు, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: