ETV Bharat / city

భగవద్గీత స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు..

ఆకలితో అలమటించే వారికి ఆహారం పెట్టడం.. చలికి వణికే వృద్ధులకు దుప్పట్లు ఇవ్వడం.. చదువుకునే వారిని ప్రోత్సాహించడం.. అనారోగ్యంతో ఉన్న వారికి వైద్య సేవలు అందించడం.. ఇలా అనాథల నుంచి నిరుపేదల వరకు నిత్యం ఆసరగా నిలవడం శ్రీకృష్ణ ఫౌండేషన్​ వారి నైజం. నలుగురితో మొదలై వందల మంది సభ్యులతో సేవా కార్యక్రమాలు చేపడుతూ.. అందరీ మన్నల్నీ పొందుతోంది ఆ ఫౌండేషన్​. వారు చేస్తున్న సేవా కార్యక్రమాల భగద్గీత చదవడమే కారణం అంటున్నారు. ఇంతకు ఆ ఫౌండేషన్​ ఎక్కడుంది. వారి ప్రస్థానం గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.

sri krishna foundation in nellore
శ్రీ కృష్ణ పౌండేషన్
author img

By

Published : Jan 7, 2021, 3:41 PM IST

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం నిప్పో కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నలుగురు.. పదేళ్ల క్రితం శ్రీ కృష్ణ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు. నాలుగైదు ఏళ్ల పాటుగా ఉచితంగా భగద్గీత పుస్తకాల పంపిణీ చేశారు. పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సాయం చేస్తూ బాగా చదువుకునేలా ప్రోత్సహించేవారు. నాయుడుపేట, పెళ్లకూరు, తడ, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, ఓజిలి, సత్యవేడు, శ్రీ కాళహస్తి, తమిళనాడు ఇంకా పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు పెద్దలను గౌరవించాలని వృద్ధులకు దుస్తులు అందిస్తున్నారు.

లాక్​డౌన్​లో సేవా కార్యక్రమాలు..

లాక్ డౌన్ సమయంలో పేదలకు 120రోజుల పాటుగా ఆహారం అందించారు. నెలకు రూ.100 వేసుకుని సేవాభావంతో ముందుకు సాగడం చూసి.. ఎంతో మంది ముందుకు వచ్చి వీరికి విరాళాలు అందించారు. నలుగురుతో మొదలైన వీరి సేవా కార్యక్రమాలు ఇప్పుడు 40 మంది సభ్యులుగా పెరిగింది. వీరు ఇచ్చిన స్పూర్తితో దాదాపు వందల మంది ముందుకొచ్చి తోచినంత సాయం చేస్తున్నారు. వీరు అందిస్తున్న ప్రోత్సాహకంతో ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. భగద్గీత చదవడంతోనే ఇలా చేస్తున్నామని నిర్వాహకులు అంటున్నారు. శ్రీ కృష్ణ ఫౌండేషన్ ద్వారా భగద్గీత గురించి వివరిస్తూ.. సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పాఠశాలల్లో భగవద్గీతను పంపిణీ చేస్తున్నారు. ప్రచారానికి ఎలాంటి తావు లేకుండా సేవలు అందిస్తున్నారు.

ఇదీ చదవండి: సామాజిక సేవలో యువత భాగస్వామ్యం.. గ్రామానికి రెండు క్లబ్‌ల దిశగా చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.