ETV Bharat / city

Malaikaja Sweet నెల్లూరు మధురమైన మలైకాజా మీరు తిన్నారా - నెల్లూరు మలైకాజా స్వీట్​

Malaikaja Sweet హైదరాబాద్ బిర్యానీ, బందరు లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు ఇలా చెప్పుకుంటే పోతే తెలుగు రాష్ట్రాల్లో అనేక వంటకాలు అద్భుత రుచికి పెట్టింది పేరు. ఇక నెల్లూరు అనగానే ఆహార ప్రియులకు చేపల పులుసు గుర్తుకొస్తుంది. ఈ జాబితాలో స్వీట్స్‌ ఇష్టపడేవారికి మాత్రం జైహింద్‌ మలైకాజానే మదిలో మెదులుతుంది. ప్రతిఒక్కరితో ఆహా ఏమి రుచి అనిపిస్తుంది.

Malaikaja Sweet
మలైకాజా
author img

By

Published : Aug 14, 2022, 2:53 PM IST

Malaikaja Sweet మలైకాజా... నెల్లూరు వాసులకు 7 దశాబ్దాలుగా అత్యంత ఇష్టమైన మిఠాయిగా ప్రసిద్ధికెక్కింది. స్వీట్స్‌ అంటే ఇష్టంలేని వారు సైతం లొట్టలేసుకుంటూ తినే రుచి మలైకాజా సొంతం అంటే నమ్మాల్సిందే! తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాలకూ ఎగుమతి అవుతున్న ఈ మలైకాజాకు చిరునామాగా నిలుస్తోంది నెల్లూరులోని జైహింద్‌ స్వీట్స్‌. ఎప్పుడో స్వాతంత్య్ర పోరాట సమయంలో పురుడుపోసుకున్న ఈ మిఠాయికి.. రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది.

మలైకాజా

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి చెందిన కమాల్‌ సింగ్‌ కుటుంబం.. 1945లో ఉపాధి వెతుక్కుంటూ నెల్లూరు వచ్చి స్థిరపడింది. స్వాతంత్రోద్యమ కాంక్ష తీవ్రంగా ఉన్న ఈ సమయంలో.. మిఠాయి వ్యాపారం ప్రారంభించిన కమాల్‌సింగ్‌... తన దుకాణానికి జైహింద్‌ అని పేరు పెట్టుకున్నారు. దమ్‌ రోటీహల్వా, బొంబాయి హల్వా, బాదుషా వంటి మిఠాయిలు విక్రయించేవారు. అయితే.. వాటన్నింటి కంటే మలైకాజా బాగా ప్రాచుర్యం పొందింది.

ఈ మలైకాజా రుచికి సామాన్యులే కాదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎన్టీఆర్‌, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం వంటి ప్రముఖులు ఫిదా అయ్యారు. నెల్లూరు వస్తే.. తప్పక ఈ కాజాను రుచిచూడాల్సిందే. ఈ మిఠాయి తెలుగువారి ప్రశంసలే కాదు.. ఇతర రాష్ట్రాలు, విదేశీయుల ఆదరణనూ పొందింది. ఆజాదీకా అమృత్ మహోత్సవాల నేపథ్యంలో.. ఈ జైహింద్ స్వీట్స్ షాప్ చర్చలోకి వచ్చింది. మరి, మీరెప్పుడైనా నెల్లూరు వెళ్తే.. ఈ కాజాను టేస్ట్ చేయడం మాత్రం మరిచిపోకండి..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.