ETV Bharat / city

తిరుపతిలో పనబాకను గెలిపించండి: సోమిరెడ్డి

రాష్ట్ర ప్రభుత్వంపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో.. సర్వేపల్లి నియోజకవర్గ తెదేపా నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Somireddy fire on ycp govt
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
author img

By

Published : Mar 20, 2021, 4:42 PM IST

తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో... నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. మద్యం ధరలు భారీగా పెంచి పేదల నడ్డి విరుస్తున్నారన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్​జీఎస్ కింద రూ.2 వేల కోట్ల నిధులు రాష్ట్రానికి విడుదల చేస్తే.... ప్రభుత్వం నీరు చెట్టు కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయకుండా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మూడు రాజధానులు అంటూ.. రాష్ట్ర రాజధాని అమరావతిని గందరగోళంగా తయారు చేశారన్నారు. తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో తెదేపా తరఫున పోటీ చేస్తున్న పనబాక లక్ష్మిని గెలిపించేందుకు ప్రతి తెదేపా కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

పగలు, ప్రతీకారాలకు వైకాపా స్వస్తి పలకాలి: యనమల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.