Snake in School: నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామ ప్రజాపరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఓ పాము అందరినీ భయాందోళనకు గురిచేసింది. పాఠశాల సమయంలోనే స్కూల్ వెనక ఉన్న పొలాల నుంచి జెర్రిపోతు జాతికి చెందిన ఆరు అడుగుల భారీ పాము స్కూల్ ప్రాంగణంలోకి ప్రవేశించింది. అక్కడే ఆడుకుంటున్న విద్యార్థుల కంటపడింది. ఒక్కసారిగా విద్యార్థులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. కొందరు ఉపాధ్యాయులు సైతం భయాందోళనకు గురయ్యారు. విద్యార్థుల కేకలు గమనించిన పాము పక్కనే ఉన్న బాత్రూంలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన పదో తరగతి విద్యార్థులు ఇద్దరు అక్కడే ఉన్న కర్రతో పామును కొట్టడంతో చనిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: జంతువుల కొవ్వుతో వంట నూనెల తయారీ... దాడి చేసిన విజిలెన్స్ అధికారులు
Snake in School: పాఠశాలలో పాము కలకలం.. సాహసించిన ఇద్దరు విద్యార్థులు - నెల్లూరు లేటెస్ట్ అప్డేట్స్
Snake in School: చేజర్ల మండలం ఆదురుపల్లిలోని హైస్కూల్లో పాము కలకలంరేపింది. ఇద్దరు పదో తరగతి విద్యార్థుల సాహసించి పామును చంపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే..?