ETV Bharat / city

నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

నేటి నుంచి 3 రోజుల పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. నెల్లూరు, కడప జిల్లాల్లో పలు  శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. జిల్లాలో కేంద్ర బలగాలతో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు  చేశారు.

నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
author img

By

Published : Aug 24, 2019, 3:20 AM IST

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు రాష్ట్రానికి రానున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయనతో పాటు గవర్నర్​ బిశ్వభూషణ్​ పలువురు కేంద్రమంత్రులు విచ్చేయనున్నారు. ప్రముఖుల రాకతో రాష్ట్రంలో కేంద్ర బలగాలతో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • నేడు మధ్యాహ్నం 12. 40 గంటలకు చెన్నై విమాశ్రయం నుంచి ప్రత్యేక ఎయిర్​ఫోర్స్​ హెలికాప్టర్​లో ఉపరాష్ట్రపతి నెల్లూరుకు బయలుదేరుతారు.
  • మధ్యాహ్నం 1. 20 గంటలకు నెల్లూరు పోలీస్​ పరేడ్​ మైదానానికి చేరుకుంటారు. అటునుంచి నగరంలోని వారి నివాసానికి వెంకయ్యనాయుడు వెళ్లనున్నారు.
  • సాయంత్రం 3.20 గంటలకు వెంకటాచలం రైల్వేస్టేషన్​ నుంచి ప్రత్యేక రైలులో కృష్ణపట్నం- ఓబులవారిపల్లి రైల్వే లైన్​ను పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటలకు కడప జిల్లా చెర్లోపల్లి రైల్వేస్టేషన్ చేరుకుంటారు. అనంతరం 5.30 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు వెంకటాచలం వెళ్లనున్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్​లో ఆ రాత్రి ఉపరాష్ట్రపతి బస చేస్తారు.
  • రేపు ఉదయం 9 గంటలకు ట్రస్ట్​లోని వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 10.25 గంటలకు రోడ్డు మార్గాన గూడూరు రైల్వే స్టేషన్​ చేరుకుని...విజయవాడ- గూడూరు ఇంటర్​ సిటీ ఎక్స్​ప్రెస్​ను ప్రారంభిస్తారు.
  • మధ్యాహ్నం 12.15 గంటలకు నెల్లూరు కస్తూర్భా కళాక్షేత్రంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో వెంకయ్యనాయుడు పాల్గొంటారు. సాయంత్రం 3.50 గంటలకు వీపీఆర్​ ఫంక్షన్​ హాల్​లో ఏర్పాటు చేసిన అభినందన సభకు హాజరవుతారు.
  • తిరిగి స్వర్ణ భారత్​ ట్రస్ట్​కు చేరుకుని అక్కడే బస చేస్తారు.
  • ఆదివారం ఉదయం 11.30 గంటలకు కొడవలూరు మండలం బొడ్డువారిపాళెం వద్ద మిథాని అల్యూమినియం పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు.
  • అనంతరం నెల్లూరులోని నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్​లో విజయవాడకు బయల్దేరుతారు.

ఈ పర్యటనలో ఉపరాష్ట్రపతితో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, రైల్వే శాఖ మంత్రి పీయూష్​ గోయల్​, హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని మాజీ మంత్రి, భాజపా నేత కామినేని శ్రీనివాస్​ వెల్లడించారు.

పర్యటన వివరాలు తెలియజేస్తున్న కామినేని శ్రీనివాస్​

ఇవీ చదవండి...'వారి ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యా'

Intro:ap_knl_111_14_seetharaamula_kalyanam_av_c11 రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా. శీర్షిక: కనుల పండువగా సీతారామ కళ్యాణం

Body:కర్నూలు జిల్లా కోడుమూరులోని శ్రీ రామాలయంలో సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. శ్రీరామనవమి పురస్కరించుకొని ముందుగా ఆలయంలో లో కొలువుదీరిన సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి లను పట్టువస్త్రాలతో ,ఆభరణాలతో, పూలమాలతో అలంకరించి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Conclusion:కళ్యాణ వేదికను పూల పందిళ్ళ తీర్చిదిద్దారు. వేదికపై సీతారాముల ఉత్సవమూర్తులను ముస్తాబు చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం నిర్వహించారు. పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో వేడుకలు తిలకించారు. అనంతరం ఎస్ ఎస్ కే ఆధ్వర్యంలో లో అన్నదానం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.