నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో నెలకొన్న అపరిశుభ్ర పరిస్థితులపై "ఈటీవీ, ఈటీవీ-భారత్"లో వచ్చిన కథనాలకు స్పందన లభించింది. స్థానికంగా ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు స్పందించారు. నగరపాలక సంస్థ అధికారులతో కలిసి బారా షహీద్ దర్గాలో తెదేపా, వైకాపా నేతలు పోటాపోటీగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నేత, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు దర్గా ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. స్వర్ణాల చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు తొలగించారు. స్వర్ణాల చెరువు ఘాట్‌ను శుభ్రం చేసి, పరిసరాలను తిరిగి ఆహ్లాదకరంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఈ పనులను పరిశీలించి, ఐదు రోజుల్లో దర్గా ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. లాక్డౌన్ నిబంధనలు పూర్తిస్థాయిలో తొలగిపోతే ఆగస్టులో రొట్టెల పండుగను వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. 'మన ఊరు-మన స్వచ్ఛత' కార్యక్రమంలో భాగంగా తాము పారిశుద్ధ్య పనులు చేపడితే, తమను చూసి అధికార పార్టీ నేతలు ఈ పనులు చేసేందుకు ముందుకు రావడం మంచి పరిణామమని తెదేపా నేతలు అన్నారు.
బారాషహీద్ దర్గాలో పారిశుధ్య పనులు... - స్వర్ణాల చెరువు తాజా వార్తలు
నెల్లూరులో ప్రసిద్ధి చెందిన బారాషహీద్ దర్గాలో నెలకొన్న అపరిశుభ్ర పరిస్థితులపై "ఈటీవీ, ఈటీవీ-భారత్"లో వచ్చిన కథనాలకు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు స్పందించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నేత, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు దర్గా ప్రాంగణాన్ని శుభ్రం చేశారు.

నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో నెలకొన్న అపరిశుభ్ర పరిస్థితులపై "ఈటీవీ, ఈటీవీ-భారత్"లో వచ్చిన కథనాలకు స్పందన లభించింది. స్థానికంగా ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు స్పందించారు. నగరపాలక సంస్థ అధికారులతో కలిసి బారా షహీద్ దర్గాలో తెదేపా, వైకాపా నేతలు పోటాపోటీగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నేత, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు దర్గా ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. స్వర్ణాల చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు తొలగించారు. స్వర్ణాల చెరువు ఘాట్‌ను శుభ్రం చేసి, పరిసరాలను తిరిగి ఆహ్లాదకరంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఈ పనులను పరిశీలించి, ఐదు రోజుల్లో దర్గా ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. లాక్డౌన్ నిబంధనలు పూర్తిస్థాయిలో తొలగిపోతే ఆగస్టులో రొట్టెల పండుగను వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. 'మన ఊరు-మన స్వచ్ఛత' కార్యక్రమంలో భాగంగా తాము పారిశుద్ధ్య పనులు చేపడితే, తమను చూసి అధికార పార్టీ నేతలు ఈ పనులు చేసేందుకు ముందుకు రావడం మంచి పరిణామమని తెదేపా నేతలు అన్నారు.
ఇదీ చూడండి: ద్వారక తిరుమల కొండపైకి ప్రైవేట్ వాహనం!