ETV Bharat / city

ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభించిన నెల్లూరు రెడ్ క్రాస్

author img

By

Published : Jun 9, 2021, 6:43 PM IST

నెల్లూరు రెడ్ క్రాస్​లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంక్​ను కలెక్టర్ చక్రధర్​బాబు ప్రారంభించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

oxygen bank by nellore red cross
ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభించిన నెల్లూరు రెడ్ క్రాస్

నెల్లూరు రెడ్ క్రాస్​లో ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభమైంది. 100 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో.. వైద్యులు సూచన మేరకు బాధితులకు వీటిని అందిస్తున్నట్లు రెడ్ క్రాస్ ప్రతినిధులు తెలిపారు. జిల్లా కలెక్టర్ చక్రధర్​బాబు దీనిని ప్రారంభించారు.

కరోనా థర్డ్ వేవ్​ను దృష్టిలో ఉంచుకుని అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామన్న కలెక్టర్.. రెడ్ క్రాస్ సేవలను కొనియాడారు. కరోనా సెకండ్ వేవ్ లో కొంత ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పటికీ అధిగమించామన్నారు. ప్రతి 50 పడకల ఆసుపత్రిలోనూ ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వైరస్ బారిన పడకుండా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

పీవీ సన్నిహితుడు రామ్ ఖండేకర్​ మృతి

నత్తనడకన.. ఆనందయ్య మందు పంపిణీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.