గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ కొత్ కేబినెట్ కొలువుదీరడంతో మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటుదక్కడంతో నెల్లూరులో ఆయన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. కాకాణి యువసేన ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ తీశారు. అనంతరం వీఆర్సీ సెంటర్ వద్ద బాణసంచా కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు. ఎమ్మెల్యేగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన కాకాణి, ఇప్పుడు మంత్రి పదవి రావడంతో జిల్లా కూడా అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని యువసేన నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు అభిమానుల్లో ఉత్సాహం: శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలి వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
ఇదీ చదవండి: Jagan New Cabinet: కొలువుదీరిన జగన్ కొత్త టీం